VIDEO: గుంతల మయంగా మారిన అంతర్గత సీసీ రోడ్లు
KNR: కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క నుంచి అంబేడ్కర్ స్టేడియం వైపు వెళ్లే అంతర్గత సీసీ రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వాహనదారులు, పాదచారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.