జిల్లాలో 12 లక్షల గ్రామీణ ఓటర్లు

జిల్లాలో 12 లక్షల గ్రామీణ ఓటర్లు

పల్నాడు: జిల్లాలో పంచాయతీ ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీల్లో 12,67,982 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 6,23,010 మంది పురుషులు, 6,44,897 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 75 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లో 4,63,489 మంది ఉన్నట్లు తెలిపారు.