'పేదవాడి ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ లక్ష్యం'

'పేదవాడి ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ లక్ష్యం'

SKLM: నరసన్నపేటలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి అన్న క్యాంటీన్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. పేదవాడి ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.