లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

SKLM: ఆమదాలవలస పట్టణంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఘనంగా భక్తులు పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రశాంత్, నారాయణ ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ధర్మకర్తలు ఉత్తర ద్వార గుండా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.