ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌కు మరమ్మతులు
PLD: చిలకలూరిపేటలోని ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌కు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మాల కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ విజయ్ కుమార్ బుధవారం వాటిని సందర్శించి, పరిశీలించారు. మరమ్మతులు రూ.22 లక్షలతో చేపడతున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆశయంతో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుందన్నారు.