కంకిపాడు గ్రామ శివారులో కూలిన చెట్టు

కృష్ణా: కంకిపాడు గ్రామ శివారులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారిపై చెట్టు కూలింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పంచాయతీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, చెట్టును రహదారిపై నుంచి తొలగించారు. దీంతో రాకపోకలు సవ్యంగా జరిగేలా చేశారు.