కాకినాడలో ఈ నెల 9న జాబ్ మేళా

KKD: కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభవమవుతుందన్నారు. పది, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.