VIDEO: దారుణం.. టీచర్‌పై విద్యార్థి దాడి
W.G: పాలకొల్లు మండలం లంకల కోడేరులో దారుణం చోటుచేసుకుంది. ఇనుపరాడ్డుతో ఆర్యదీప్ అనే పూర్య విద్యార్థి టీచర్ వెంకట సురేష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో టీచర్ తీవ్రంగా గాయపడ్డాడు. సక్రమ మార్గంలో నడుచుకోవాలని చెప్పినందుకు టీచర్‌పై కక్ష పెట్టుకుని దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.