బస్సు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

బస్సు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

NDL: బండి ఆత్మకూరు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బోయ బాలన్న అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం నంద్యాలకు వెళ్లేందుకు ఆయన బస్సు ఎక్కుతుండగా, డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని కదిలించారు. దీంతో కిందపడిన బాలన్న కాలిపై నుంచి బస్సు టైర్ వెళ్లడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.