IND vs PAK: సగం వికెట్లు కోల్పోయిన పాక్
U-19 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. దీంతో 29 ఓవర్లు ముగిసే సరికి పాక్ సగం వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. దీపేశ్ దేవంద్రన్ 3 వికెట్లతో అదరగొట్టాడు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ విజయానికి 20 ఓవర్లలో మరో 142 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే ఐదు వికెట్లు పడగొట్టాలి.