కరాటే జోనల్ బాల బాలికల ఎంపిక పోటీలు
MNCL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలో అండర్ 14 కరాటే జోనల్ బాల బాలికల ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్, కరాటే అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రవి, శివ మహేష్ తెలిపారు.