పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్.. ఎవరి దారి వారిదే.!
NTR: విజయవాడ నైస్ బార్ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజీ రోడ్ పశువుల ఆసుపత్రి జంక్షన్ నుంచి ఏలూరు రోడ్, సిద్ధార్థ జంక్షన్ నుంచి పుష్ప హోటల్ సెంటర్ వెళ్లే వాహనాలన్నీ ఈ కూడలిగానే ప్రయాణించాల్సి వస్తోంది. సిగ్నల్ పని చేయకపోవడంతో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లి ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.