బాధితులకు రూ. 3లక్షల పరిహారం జమ

విశాఖ: సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా శుక్రవారం రూ. 3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ & రన్‌లో తీవ్ర గాయాలైన ఆరుగురుకి రూ. 50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 69 మందికి రూ. 55.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.