కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల కలకలం..!

కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల కలకలం..!

HNK: హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ (కేయూ)లోని సమ్మక్క సారక్క హాస్టల్‌లో ఎలుకలు కలకలం సృష్టించాయి. సుమారు 14మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ వద్దకు వెళ్లగా మందులు లేవని చెప్పడంతో విద్యార్థులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. సమస్యపై సిబ్బందికి పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.