వైసీపీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్

ELR: వైసీపీ అధ్యక్షులు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అదేశాల మేరకు ద్వారకా తిరుమలకు చెందిన పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్ వైసీపీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, పలువురు జ్యోతి శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.