VIDEO: రోడ్లపై చెత్తతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

VIDEO: రోడ్లపై చెత్తతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

WGL: నర్సంపేట నుంచి కొత్తగూడెం వైపు వెళ్లే రహదారిపై చెత్త సమస్య తీవ్రంగా మారిందని ప్రయాణికులు ఆరోపించారు. దామర చెరువు దాటిన వెంటనే మున్సిపాలిటీ చెత్తను రోడ్ల పక్కనే పారేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చెత్త నుంచి దుర్వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.