విరిగిన విద్యుత్ స్తంభం.. నిర్లక్ష్యంలో అధికారులు

విరిగిన విద్యుత్ స్తంభం.. నిర్లక్ష్యంలో అధికారులు

HYD: బొల్లారం బంజారా విలేజ్ కాలనీలో నెల క్రితమే విరిగిపోయిన విద్యుత్ స్తంభం ఇప్పటికీ యథావిధిగానే ఉండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు పలుమార్లు విద్యుత్ శాఖకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్తంభం ఎప్పుడైనా కూలిపోవచ్చని భయంతో రాత్రివేళలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.