ఈనెల 7న జూడో జట్ల ఎంపికలు

ఈనెల 7న జూడో జట్ల ఎంపికలు

NTR: కండ్రికలోని ఏఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ నెల 7వ తేదీన ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల క్యాడెట్ జూనియర్ బాలబాలికల జూడో జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా జూడో సంఘం కార్య దర్శి ఎన్. పవన్ సందీప్, కృష్ణా జిల్లా జూడో సంఘం కార్యదర్శి వెంకట్ నామిశెట్టి సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 83338 23118, 73862 25278 నంబర్లలో సంప్రదించాలన్నారు.