చింతపల్లిలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
ASR: చింతపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో ముందుగానే బుకింగ్ చేసుకున్నప్పటికీ, సిలిండర్లు అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ చూపించినా, ఏజెన్సీ సిబ్బంది మళ్లీ బుకింగ్ చేయాలని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.