వైద్య కళాశాలలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వైద్య కళాశాలలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ కేటగిరీల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ నాగమణి మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్ 5, అసోసియేటెడ్ ప్రొఫెసర్ 11, అసిస్టెంట్ ప్రొఫెసర్ 6 పోస్టులు అదే విధంగా గౌరవ వేతనం కింద సీనియర్ రెసిడెంట్ 21 ఖాళీ పోస్టులు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 6 తేదీన ఉదయం 9 గంటలకు కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించాలన్నారు.