ఆత్మకూరులో ఈ నెల 29న మెగా జాబ్ మేళా

ఆత్మకూరులో ఈ నెల 29న మెగా జాబ్ మేళా

NDL: ఆత్మకూరులో ఈనెల 29న నైపుణ్యాఅభివృద్ధి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో సంబంధిత పోస్టర్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విడుదల చేశారు. మేళాకు 14 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.