నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఎ.సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల రెవెన్యూ, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు.