అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

NGKL: అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శారద ఆధ్వర్యంలో శనివారం వాహన తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో 16 బస్తాల నల్లబెల్లం, ఐదు కేజీల పటిక, కారు, 6 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు. ఆబ్కారీ పోలీసులు మాట్లాడుతూ.. సారాను తయారు చేసేందుకు వాడే నల్ల బెల్లం పటిక తరలింపు చట్టరీత్యా నేరమన్నారు.