వలస పిల్లల చదువుకు 236 సీజనల్ హాస్టళ్లు

వలస పిల్లల చదువుకు 236 సీజనల్ హాస్టళ్లు

AP: రాష్ట్రవ్యాప్తంగా వలస కుటుంబాల పిల్లల కోసం 236 సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ హాస్టళ్ల ద్వారా రాష్ట్రంలోని పిల్లలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్లలకు కూడా వారి మాతృభాషలోనే విద్యను అందించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 11,842 మంది వలస కార్మికుల పిల్లలు ఉన్నారని సమగ్ర శిక్ష అధికారులు అంచనా వేశారు.