నున్నలో కాల్వ గేట్ల సమస్యకు పరిష్కారం

కృష్ణా: గన్నవరం నియోజకవర్గలోని నున్నలో పోలవరం ప్రధాన కాలువ గేట్ నెం.8 వద్ద చెత్త కుప్పలు పేరుకుపోవడంతో గేట్లు సరిగ్గా పనిచేయక నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. ఈ సమస్యపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించి అధికారులు, రైతుల సహకారంతో తక్షణమే చెత్త తొలగింపుచేసి గేట్లను మూసివేశారు. దీంతో నీటి మట్టం 1.75 మీటర్లకు స్థిరంగా కొనసాగుతోంది.