'రైతు రిజిస్ట్రీని వేగంగా పూర్తి చేయాలి'
ASF: జిల్లాలో లక్ష్యం మేరకు రైతు రిజిస్ట్రీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో వ్యవ సాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి రైతూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, బీమా పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కలుగుతుందన్నారు.