మా భూభాగంపైకి మిస్సైల్ దూసుకొచ్చింది: టర్కీ
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో తమ భూభాగంపైకి మిస్సైల్ దూసుకొచ్చిందని టర్కీ వెల్లడించింది. గాల్లోనే దాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. క్షిపణి శకలాలు గజియన్‌టెప్ ప్రాంతంలో పడినట్లు చెప్పింది. తాము మంచి పొరుగు దేశంగా ఉంటామని టర్కీ స్పష్టం చేసింది. అయితే, తమ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తే మాత్రం ఉపేక్షించమని హెచ్చరించింది.