'హెవీ ట్రాఫిక్ జామ్‌తో ప్రజలకు ఇబ్బందులు'
కృష్ణా: గుడివాడ-బంటుమిల్లి రోడ్డుపై సోమవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల సంఖ్య పెరగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. వెంటనే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, అనధికార పార్కింగులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.