రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

MNCL: సింగరేణిలో శనివారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రక్షణ, ఉత్పత్తి, ఉత్పాదకత, వైద్య సదుపాయాలకు సంబంధించి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 040-23311338 నంబర్‌కు కాల్ చేసి తమ అభిప్రాయాలు, సూచనలను నేరుగా సీఎండీతో పంచుకోవచ్చని సూచించారు.