జిల్లాలో రెండు రోజులు పూల వ్యాపారం బంద్

KMM: జిల్లాలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది.