ఆదిత్యుని సేవలో ఆర్మీ జనరల్

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆలయ ఈవో యర్రం శెట్టి భద్రజీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ ఈవో స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.