నెతన్యాహుతో గొడవలు 'ఫేక్ న్యూస్': ట్రంప్

నెతన్యాహుతో గొడవలు 'ఫేక్ న్యూస్': ట్రంప్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో తనకు గొడవలు జరిగినట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ 'ఫేక్ న్యూస్' అని, తమ మధ్య సంబంధం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. నెతన్యాహుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది.