'టీవీ, నాటక రంగానికీ అవార్డులు ఇవ్వాలి'
ఉగాది పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందించడంపై నటుడు మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, సినిమాలతో సమానంగా టీవీ రంగం కూడా దూసుకుపోతోందని, టెలివిజన్ కళాకారులకు కూడా అవార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, అన్ని కళలకు మూలమైన నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించి, నాటక అవార్డులను కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.