'ఒకప్పుడు ఆదర్శ పాఠశాల, నేడు దీనస్థితిలో ఉంది'

'ఒకప్పుడు ఆదర్శ పాఠశాల, నేడు దీనస్థితిలో ఉంది'

SKLM: ఒకప్పుడు 200 మంది విద్యార్థులు, విద్యార్థినులు ఉన్న పాఠశాలలో నేడు కనీసం 10 మంది విద్యార్థులు, విద్యార్థినులు కూడా లేని దుర్భర పరిస్థితి. పొందూరు మండలం కోటిపల్లి పంచాయతీ మజ్జిలిపేట గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల ఈ దుస్థితికి చేరింది. కొన్నేళ్ల క్రితం ఈ పాఠశాల చుట్టుపక్క గ్రామాలైన కోటిపల్లి, ఇల్లయ్యగారిపేట గ్రామాలకు ఆదర్శ పాఠశాలగా నిలిచింది.