VIDEO: అంజన్న ఆశీర్వాద పాదయాత్రలో జననీరాజనం
KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన 'అంజన్న ఆశీర్వాద పాదయాత్ర'తో గంగాధర ఎక్స్ రోడ్డు జనసంద్రమైంది. శనివారం సాయంత్రం ఆయన యాత్ర గంగాధరకు చేరుకోగా, బీజేపీ కార్యకర్తలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 'జై శ్రీరామ్' నినాదాలతో పరిసరాలన్నీ హోరెత్తాయి. ఎక్స్ రోడ్డుకు నలువైపులా ప్రజలు కిక్కిరిసిపోవడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.