పుల్లలచెరువులో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి సస్పెండ్
ప్రకాశం: పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రుజువుకావడంతో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ రాజబాబు సస్పెండ్ చేశారు. నిధుల వినియోగంపై నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.