వరదలో కొట్టుకొచ్చిన జింకను కాపాడిన యువకులు
NZB: సాలూర మండలం మందర్న గ్రామంలో శనివారం మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో వరద దాటికి ఓ జింక శనివారం గ్రామంలోకి కొట్టుకొచ్చిందని గ్రామస్తులు తెలిపారు. దానిని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి దానిని అప్పగించామని వారు తెలిపారు. వరదలో కొట్టుకొచ్చిన జింకను కాపాడిన యువకులను అధికారులు, పలువురు అభినందించారు.