VIDEO: ఆదివాసీ సంప్రదాయ నృత్యం చేసిన MLA

ASF: ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి నివాసంలో కుటుంబ సమేతంగా అంగరంగ వైభవంగా మంగళవారం గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలతో పూజలు చేసి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళలతో ఎమ్మెల్యే ఆదివాసీ సంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు.