టీడీపీ కుప్పం మైనార్టీ అధ్యక్షుడిగా జాకీర్
చిత్తూరు: TDP కుప్పం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడిగా మూడోసారి జాకీర్ ఎన్నికయ్యాడు. గతంలో రెండుసార్లు మైనార్టీ అధ్యక్షుడుగా పనిచేసిన జాకీర్‌ను మరోమారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాకీ నియామకం పట్ల మైనార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో మూడోసారి అవకాశం కల్పించిన పార్టీ శ్రేణులకు జాకీర్ కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేస్తామన్నారు.