VIDEO: లోక్ అదాలత్ ద్వారా 1208 కేసులు రాజీ
AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ పి షియాజ్ ఖాన్, ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం రోహిత్ కక్షిదారుల మధ్య రాజీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కేసులు పరిష్కారంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని పేర్కొన్నారు. మొత్తం 1208 కేసులు పరిష్కరించినట్లు న్యాయస్థానం సిబ్బంది తెలిపారు.