VIDEO: యూరియా దొరక రైతు ఆత్మహత్యయత్నం

MHBD: కొత్తగూడ మండలం బూరుగుగుంపుకు చెందిన మల్లెల నర్సయ్య అనే రైతు యూరియా అందలేదని శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డడు. పంటకు అవసరమైన యూరియా ఎరువులు అందకపోవడంతో తాను వేసిన పంటలు నష్టం వాటిల్లుతుందని మనస్థాపానికి గురై పురుగు మందు తాగాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.