మైదుకూరులో ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణ

KDP: మైదుకూరులోని శ్రీకృష్ణదేవరాయ కూడలిలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పాఠశాల విద్యార్థులు వేసిన గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల వేషధారణ ప్రజలను ఆకట్టుకుంది.