పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
WNP: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఆర్అండిబి రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు, పెబ్బేరులో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.