పులి వాహనంపై దర్శనమిచ్చిన భావనారాయణుడు

KDP: పద్మశాలీల కుల బాంధవుడైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణం సిద్దవటం మండలంలోని మాధవరం-1లో బుధవారం వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం రాత్రి పులి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రతినిధులు గ్రామ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తులు కాయ, కర్పూరాలను సమర్పించి మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.