రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
CTR: శాంతిపురం(M) మఠం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడిని వీకోట మండలం దాసార్లపల్లికి చెందిన చంద్రకాంత్ స్థానికులు గుర్తించారు. ఆయన బైకు మీద దాసర్లపల్లి నుంచి గుండిశెట్టిపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.