వృద్ధులకు రగ్గులు పంపిణీ

వృద్ధులకు రగ్గులు పంపిణీ

కోనసీమ: అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామం అంబేద్కర్ నగర్‌లోని వృద్ధులకు, పేదలకు సామాజిక సేవా కార్యకర్త బండారు శ్రీదేవి శనివారం రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శీతాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వారికి రగ్గులతోపాటు బిస్కెట్స్, బ్రెడ్‌లు అందజేశారు.