బాల్య వివాహాన్ని అడ్డుకున్న CWC అధికారులు

KMR: రామారెడ్డి గ్రామానికి చెందిన యువకుడుకి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో శుక్రవారం పెళ్లి జరిపించారు. దీంతో విషయం తెలుసుకున్న సీడబ్ల్యుసీ అధికారులు గ్రామానికి వెళ్లి ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ చేశారు. చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బాలికకు పెళ్లిచేసిన తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.