తాడేపల్లిగూడెంలో చిన్నారుల ర్యాలీ
W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు బస్టాండ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.