యుద్దం దెబ్బకు గుడ్డు విలవిల.. పడిపోయిన రేటు
E.G: రాష్ట్రంలో గుడ్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. రెండు నెలల క్రితం రూ.8 పలికిన ధర ప్రస్తుతం రూ.4.25 నుంచి రూ.4.50కు చేరుకుంది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడింది. భారత్ నుంచి గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లలో విక్రయించాల్సి రావడంతో ధరలు తగ్గాయి. ఓ వైపు ఎండల వల్ల గుడ్ల వినియోగం తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.