'ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి'

NDL: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య కోరారు. ఇందులో భాగంగా ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మద్దిలేటి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు.